Home » AP Politics
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్‌పై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ధ్వజమెత్తారు.
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల లోకేశ్‌తో రాజ్‌దీప్ ముఖాముఖి సంభాషణ నిర్వహించారు.
‘నేడు ఇంతమంది ముఖాల్లో నవ్వులు చూస్తున్నా. నా జీవితంలో ఈరోజును తప్పకుండా గుర్తు పెట్టుకుంటా’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన పేదల పట్టాల పండుగ సభలో సీఎం మాట్లాడారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అవినీతి, నేరపూరిత మనస్తత్వం ముందు అంతర్జాతీయ మాఫియా డాన్లు సైతం దిగదుడుపే అంటూ ఎద్దేవా చేశారు.
సీఎం చంద్రబాబు చేతులతో శాశ్వత ఇళ్ల పట్టాలను విజయవాడ నగర వాసులకు ఇవ్వడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాలను చంద్రబాబు పంపిణీ చేయడం జీవితకాలం ప్రజలకు గుర్తు ఉంటుందని పేర్కొన్నారు.
త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏపీలో సీఎం చంద్రబాబు, దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ.. వారి డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. ధర్నాలు చేయడం సమంజసం కాదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తమకు తెలుసంటూ మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురై, విధ్వంసకరమైన నీటిపారదుల వ్యవస్థను సీఎం చంద్రబాబు నేడు గాడిలో పెట్టారని పేర్కొన్నారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా బనగానపల్లెలో షాదీఖానా నిర్మిస్తానని జీఎమ్ సెంటర్‌లో తొడగొట్టి చెప్పానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు.