బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:32 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బిల్‌గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు..
అమరావతి, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి (Minister Kolusu Parthasarathy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బిల్‌గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఐదేళ్ల పాలన డిస్ట్రక్షన్‌కి సంకేతమని ఎద్దేవా చేశారు. కూటమి పాలన కన్‌స్ట్రక్షన్‌కు నిదర్శనమని ఉద్ఘాటించారు. అమరావతి వేదికగా మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు.
అమరావతి నిర్మాణాన్ని ఓర్చుకోలేకపోతున్నారు..
కూల్చివేతల ఆలోచన ఉన్న జగన్ రెడ్డి.. అమరావతి నిర్మాణం జరుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ను బిల్‌గేట్స్ పొగడటంతో జగన్, సాక్షి మీడియా విష ప్రచారానికి పూనుకున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ బాగుపడటం జగన్‌కు ఏమాత్రం ఇష్టం లేదని.. అందుకే తన అనుచరులతో బిల్స్‌గేట్స్ పర్యటనపై బురద చల్లిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. అభివృద్ధిలో వెనకడుగు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి అండ్ కోకి ప్రజలే తగినవిధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది: మంత్రి అనగాని సత్యప్రసాద్
బిల్ గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోందని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతికి బిల్‌గేట్స్ అందిస్తున్న తోడ్పాటును చూసి జగన్ అండ్ కో ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ అండ్ కో కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు.
ఏపీకి వెన్నుదన్నుగా బిల్ గేట్స్ ఉన్నారు..
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బిల్‌గేట్స్ సహకారంతో ఐటీ హబ్‌గా హైదరాబాద్ చరిత్ర సృష్టించిందని ఉద్ఘాటించారు. ఈనాడు ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో ఏపీకి వెన్నుదన్నుగా బిల్ గేట్స్ ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏపీకి బిల్‌గేట్స్ రాకను బ్లూ మీడియా బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు. గతంలోనూ అనేక పరిశ్రమలను ఏపీ నుంచి జగన్ అండ్ కో వెళ్లగొట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..
వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News