Home » Bill Gates
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు.
ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. అలాగే చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్వాగతం పలికారు.
బిల్ గేట్స్‌కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి బిల్ గేట్స్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి.
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీకి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్ అని పోస్టు చేశారు సీఎం.
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్‌తోపాటు ఆయన ప్రతినిధి బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపైన బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రన్‌వే స్పష్టంగా కనిపించలేదు.
ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవం ద్వారా సామాన్యులకు మెరుగైన, సత్వర వైద్యసేవలందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎల్లుండి అమరావతికి వస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని పథకం ద్వారా ఏపీలో గ్రామీణ ఆరోగ్య సేవలు 'గేమ్ ఛేంజర్' కాబోతున్నాయని ఆయన తెలిపారు..
లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన దస్త్రాల్లో తన పేరు రావడంపై బిల్ గేట్స్ స్పందించారు. ఎప్‌స్టీన్‌కు కేటాయించిన ప్రతి క్షణానికి తాను ప్రస్తుతం పశ్చాత్తాపపడుతూ క్షమాపణ చెబుతున్నానని అన్నారు.