Share News

మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. ఒక్క నెలలో రూ.49 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరి..

ABN , Publish Date - Jun 30 , 2026 | 02:18 PM

ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జూన్ నెలలో కంపెనీ మార్కెట్ విలువలో 570 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.49 లక్షల కోట్లకు పైగా) ఆవిరయ్యాయి.

మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. ఒక్క నెలలో రూ.49 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరి..
Microsoft stock

ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జూన్ నెలలో కంపెనీ మార్కెట్ విలువలో 570 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.49 లక్షల కోట్లకు పైగా) ఆవిరయ్యాయి. 2000 డాట్‌కామ్ సంక్షోభం తర్వాత మైక్రోసాఫ్ట్‌కు అత్యంత చెత్త నెలగా ఈ జూన్ నిలవనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత 25 ఏళ్లలో మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ ఈ స్థాయి పతనం ఎదుర్కోలేదు (Microsoft market value fell).


మైక్రోసాఫ్ట్ ఇటీవల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై భారీగా పెట్టుబడులు పెట్టింది. డేటా సెంటర్లు, ఏఐ చిప్, ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలపై బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అయితే వాటి ద్వారా ఆశించిన స్థాయిలో లాభాలు ఇప్పట్లో రావనే అంచనాల కారణంగా కంపెనీ షేర్లు జూన్ నెలలో 17 శాతం వరకు పడిపోయాయి. అలాగే భవిష్యత్తులో ఏఐ కారణంగా సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవలకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన కూడా షేర్లపై ప్రభావం చూపుతోంది (Microsoft shares).


ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో మైక్రోసాఫ్ట్‌కు చెందిన 'అజ్యూర్ క్లౌడ్' వృద్ధి అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం కూడా మార్కెట్‌ను నిరాశపరిచింది (Microsoft news). అంతేకాదు, ఈ ఏడాది చివరి నాటికి అజ్యూర్ క్లౌడ్‌పై 190 బిలియన్ డాలర్ల మూలధన వ్యయం చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించడం కూడా పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసింది. కొందరు విశ్లేషకులు ఈ పతనాన్ని దీర్ఘకాల పెట్టుబడిదారులకు మంచి అవకాశంగా చూస్తుండగా, మరికొందరు మాత్రం ఏఐ పెట్టుబడుల ఫలితాలు స్పష్టమయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..


ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

Updated Date - Jun 30 , 2026 | 02:18 PM