Home » Business news
గత మూడు సెషన్లుగా నష్టాలనే చవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం కాస్త కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఐటీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది. అయితే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (రూ.90.43) మరింతగా క్షీణించడంతో ఆందోళన తప్పలేదు.
ఏడాదికి అడ్వాన్స్ ఇన్‌కం ట్యాక్స్ నాలుగు దఫాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత దఫా చెల్లించేందుకు డిసెంబర్ 15 చివరి తేదీ. అసలు.. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు, ఎంత మొత్తంలో చెల్లించాలి. మినహాయింపులు ఏంటి, ఎలా చెల్లించాలో ఇక్కడ చూద్దాం.
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని ఊరికే చెప్పారా.. ఇది అక్షర సత్యమని ఎన్నో సందర్భాల్లో రుజువైన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న రాయితోనే ఐదు వేల రూపాయలు సంపాదించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగుతున్నాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు పెరిగాయి. అంతేకాక వెండి ధర కేజీ రూ.2 లక్షల మార్క్ ను టచ్ చేసింది. నేటి బంగార, వెండి ధరల వివరాలు చూస్తే...
పసిడి ప్రియులకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా నాలుగు రోజులు పాటు పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. నేటి గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
దేశీయ కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 47 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.90 మైలురాయికి చేరింది.
సోమవారం విదేశీ మదుపర్లు రూ.1, 171 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగాయి.
గరుడవేగ సంస్థ ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ మేనేజ్మెంట్ ఉద్యోగుల కోసం సైక్లింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యమే తమకు ముఖ్యమని సంస్థ డైరెక్టర్ తెలిపారు.
ఉదయం భారీగా లాభపడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత నేల చూపులు చూశాయి. రూపాయి పతనం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగాయి.