హురున్ ఇంపాక్ట్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్, దివీస్
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:30 AM
పర్పెచువల్ కాపిటల్ - హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 - 2026 జాబితా వెలువడింది. ఐక్యరాజ్య సమితి పేర్కొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్న 50 దేశీయ కంపెనీలకు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పర్పెచువల్ కాపిటల్ - హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 - 2026 జాబితా వెలువడింది. ఐక్యరాజ్య సమితి పేర్కొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్న 50 దేశీయ కంపెనీలకు ఈ జాబితాలో చోటు లభించింది. వాతావరణ పరిరక్షణ, నీటి సద్వినియోగం, లింగ సమానత్వం వంటి 17 అంశాల ప్రాతిపదికన ఈ కంపెనీలను ఎంపిక చేసినట్టు హురున్ ఇండియా వ్యవస్థాపకులు మరియు ప్రధాన పరిశోధకులు అనస్ రెహమాన్ జునైద్ చెప్పారు. ఈ తాజా జాబితాలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, దివీస్ లేబరేటరీస్ కంపెనీలకు కూడా చోటు లభించింది. ఈ సంవత్సరం జాబితాలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందూస్థాన్ యూనిలీవర్ కంపెనీకి ప్రథమ స్థానం, ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీ్‌సకు రెండవ స్థానం లభించాయి. మొత్తం 150 కంపెనీల పనితీరును పరిగణనలోకి తీసుకుని చివరికి 50 కంపెనీలను ఏ ఏడాది జాబితా కోసం ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం దాదాపు 1.8 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.162 లక్షల కోట్లు) మార్కెట్ క్యాప్ ఉన్న ఈ 50 కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్) కింద 100 కోట్ల డాలర్లు (దాదాపు రూ.9,000 కోట్లు) ఖర్చు చేసినట్టు జునైద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం