Share News

మార్కెట్లు ఢమాల్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:34 AM

దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మళ్లీ అమెరికా-ఇరాన్‌ దేశాల ఉద్రిక్తతల ప్రభావం పడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమై భారీ స్థాయిలో అమ్మకాలు సాగించడంతో సూచీలు...

మార్కెట్లు ఢమాల్‌

సెన్సెక్స్‌ 1,236 పాయింట్లు డౌన్‌

  • అదే బాటలో నిఫ్టీ

  • అంతర్జాతీయ ఉద్రిక్తతలే కారణం

  • రూ.7 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మళ్లీ అమెరికా-ఇరాన్‌ దేశాల ఉద్రిక్తతల ప్రభావం పడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమై భారీ స్థాయిలో అమ్మకాలు సాగించడంతో సూచీలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో మూడు రోజుల లాభాలకు తెరపడింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ రేట్ల కోతపై ఏర్పడిన అనిశ్చితి, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని విశ్లేషకులంటున్నారు. ఫలితంగా సెన్సెక్స్‌ 1,236.11 పాయింట్లు నష్టపోయి 82,498.14 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,470.05 పాయింట్లు నష్టపోయి 82,264.20 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిం ది. నిఫ్టీ 365 పాయింట్ల నష్టంతో 25,454.35 వద్ద ముగిసింది. ఒకపక్క అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు పెరగడంతో పాటు బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఈ ఏడాది గరిష్ఠ స్థాయికి చేరడం తో మార్కెట్‌ బేర్‌ పట్టులోకి జారుకుందని జియోజిత్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.

  • బీఎస్ఈలో లిస్టింగ్‌ అయిన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6,79,210.1 కోట్లు నష్టపోయి రూ.4,65,22,014.57 కోట్ల వద్ద (5.13 లక్షల కోట్ల డాలర్లు) ముగిసింది.


కొంత కాలం అప్రమత్తమే

మార్కెట్లో రిస్క్‌ తీసుకునే ధోరణి తగ్గిందని, ఫలితంగా ప్రపంచ స్థాయిలో కమోడిటీ ధరలు ఒక శాతం వరకు పెరిగాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. పెరిగిన ఉద్రిక్తతలతో ఆయిల్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడవచ్చన్న భయాల కారణంగా ఇన్వెస్టర్లు కొంతకాలం పాటు అప్రమత్త వైఖరి అనుసరించవచ్చని భావిస్తున్నామన్నారు.

7-Business.jpg

మళ్లీ వెండి మెరుపులు

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విలువైన లోహాల ధరలు మరోసారి తళుక్కుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.18,000 పెరిగి రూ.2.64 లక్షలకు దూసుకుపోయింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,950 పెరిగి రూ.1,58,650 పలికింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) 1.03ు పెరిగి 77.97 డాలర్లకు చేరింది. బంగారం ధర స్వల్పంగా పుంజుకుని 4,991.24 డాలర్లు పలికింది.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 20 , 2026 | 03:34 AM