స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. పతనానికి కారణాలు ఇవేనా..
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:47 PM
వరుసగా మూడు రోజుల పాటు లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం భారీ పతనాన్ని చవి చూశాయి. భారీగా నష్టపోయాయి. వరుస లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం సూచీలను నష్టాల దిశగా నడిపించింది.
వరుసగా మూడు రోజుల పాటు లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం భారీ పతనాన్ని చవి చూశాయి. భారీగా నష్టపోయాయి. వరుస లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం సూచీలను నష్టాల దిశగా నడిపించింది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలు కావడంతో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఇక, ఇటీవలి కాలంలో వరుసగా పెరిగిన బ్యాకింగ్ సెక్టార్ ఒక శాతం మేర పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెనెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (83,734)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 230 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. మళ్లీ కోలుకోలేకపోయింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 1236 పాయింట్ల నష్టంతో 82,498 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 365 పాయింట్ల నష్టంతో 25,454 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ, యూపీఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, సమ్మన్ క్యాపిటల్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). హిందుస్థాన్ పెట్రో, పెర్సిస్టెంట్, పేటీఎమ్, కేన్స్ టెక్నాలజీస్, లోధా డెవలపర్స్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 811 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 955 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.67గా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎముకలు విరగకపోతే నేరం కాదు.. మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్ల అమానవీయ చట్టం..
మీ అబ్జర్వేషన్‌కు టెస్ట్.. ఈ కుక్కలకు కావాల్సిన ఎముక ఎక్కడుందో 12 సెకెన్లలో గుర్తించండి..