Share News

ఎముకలు విరగకపోతే నేరం కాదు.. మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్ల అమానవీయ చట్టం..

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:07 PM

ఆధునిక ప్రపంచంలో మహిళలు అంతరిక్షంలోకి వెళ్లి వస్తుంటే, అఫ్గానిస్థాన్‌లో మాత్రం ఇల్లు దాటడానికి కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. మధ్యయుగాల నాటి బానిసల్లా బ్రతుకుతున్నారు. దీనికంతటికీ కారణం తాలిబన్ల అరాచకం.

ఎముకలు విరగకపోతే నేరం కాదు.. మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్ల అమానవీయ చట్టం..
Taliban law on domestic violence

ఆధునిక ప్రపంచంలో మహిళలు అంతరిక్షంలోకి వెళ్లి వస్తుంటే, అఫ్గానిస్థాన్‌లో మాత్రం ఇల్లు దాటడానికి కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. మధ్యయుగాల నాటి బానిసల్లా బ్రతుకుతున్నారు. దీనికంతటికీ కారణం తాలిబన్ల అరాచకం. తాజాగా అఫ్గాన్ మహిళల హక్కులను పూర్తిగా కాలరాస్తూ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్‌జాదా ఒక భయంకర శిక్షాస్మృతిని తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ప్రకారం మహిళలు మనుషులుగా కాకుండా భర్తల ఆస్తిగా పడి ఉండాల్సిందే. ఈ కొత్త చట్టం పిల్లలకు కూడా వ్యతిరేకంగా ఉంది (Taliban new criminal code).


మహిళలు, పిల్లలపై జరిగే గృహహింసను ఈ కొత్త శిక్షాస్మృతి చట్టబద్దం చేస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి తన భార్యను లేదా పిల్లలను శారీరకంగా హింసించడం నేరం కాదు. ఒక వ్యక్తి తన భార్యను లేదా పిల్లలను ఎముకలు విరగకుండా లేదా శరీరానికి బహిరంగ గాయాలు కాకుండా ఎంతగా బాదినా అది శిక్షార్హం కాదు. ఒకవేళ ఎముకలు విరిగి, గాయాలు కనిపించినా సరే నిందితుడికి పడే శిక్ష కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే. తాను గృహ హింసకు గురయ్యానని బాధితురాలు కోర్టులో నిరూపించగలిగితేనే ఆ 15 రోజుల శిక్ష అయినా విధిస్తారు (Afghanistan women rights).


బాధితురాలు కోర్టులో న్యాయపోరాటం చేయడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే ఆ మహిళ కోర్టుకు వెళ్లేటపుడు కూడా ఓ పురుషుడు తోడుగా ఉండాలట. తన గాయాలను కోర్టులో న్యాయమూర్తికి చూపించే సమయంలో పూర్తిగా కవర్ చేసుకునే ఉండాలి. మొహం కూడా కనిపించకుండా బురఖా ధరించాలి. ఇక, ఒక వివాహిత తన భర్త అనుమతి లేకుండా పుట్టింటికి లేదా బంధువుల ఇళ్లకు వెళితే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు (Taliban law on domestic violence).


2009లో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన 'మహిళలపై హింస నిర్మూలన' చట్టాన్ని తాలిబన్లు రద్దు చేశారు (Taliban rules 2026). దీంతో మహిళలకు కనీస హక్కులు కూడా లేకుండా పోయాయి. ఆరో తరగతి దాటిన బాలికలకు చదువు లేదు. మహిళలకు ఉద్యోగాలు లేవు. పార్కులు, జిమ్‌లు, బ్యూటీ పార్లర్‌లు అన్నీ మూతపడ్డాయి. కనీసం వైద్యం చేయించుకోవాలన్నా మగ డాక్టర్ దగ్గరకు వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఒంటరిగా మహిళలు బయట తిరగకూడదు. అఫ్గాన్‌లో తాజా పరిణామాలపై హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

సాక్షి మీడియాకు డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

మండలిలో విజిల్స్ వేస్తూ వైసీపీ హంగామా.. అచ్చెన్నాయుడు ఫైర్

Updated Date - Feb 19 , 2026 | 03:11 PM