సాక్షి మీడియాకు డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు
ABN , Publish Date - Feb 19 , 2026 | 10:44 AM
సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు జారీ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారంటూ నోటీసులు పంపారు.
అమరావతి, ఫిబ్రవరి 19: సాక్షి మీడియాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Deputy Speaker Raghurama Krishna Raju) లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు వ్యతిరేకంగా కథనాలు రాయడంతోపాటు తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కథనాలు ఉంటున్నాయంటూ నోటీసులు పంపారు. ఈరోజు (గురువారం) ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి రెడ్డి, ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లతో సహా సాక్షి మీడియా ప్రతినిధులకు లీగల్ నోటీసులు పంపించారు.
ఈ నోటీసులను న్యాయవాది ఉమేశ్ చంద్ర జారీ చేశారు. తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో రఘురామ డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా పరిహారంగా రూ.కోటి చెల్లించాలని, ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో తల్లీబిడ్డల ఆత్మహత్య కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే
ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. మంత్రుల సమాధానాలు
Read Latest AP News And Telugu News