సాయంత్రం 3 నుంచి 6 వరకూ సచివాలయంలో ఉండాల్సిందే: సీఎస్
ABN , Publish Date - Feb 19 , 2026 | 06:06 AM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయంలో...
ఇంటర్నెట్ డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయంలో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ సచివాలయంలోనే కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ బుధవారం సీఎస్ విజయానంద్ ప్రత్యేక మెమో జారీ చేశారు.