Home » Stock Market
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పడిపోతుండడం, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా నష్టాలతో ముగిశాయి.
దేశంలో నిత్యావసర వస్తువుల తక్షణ డెలివరీ సంస్థ అయిన జెప్టో త్వరలో ఐపీవోకు రాబోతోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 4వేల కోట్ల రూపాయలు సేకరించాలని నిర్దేశించుకుంది.
సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1, 468 కోట్లు విలువైన షేర్లు అమ్మేశారు. విదేశీ సంస్థాగత మదుపర్లు గత పన్నెండు రోజులుగా విక్రయాలు జరుపుతున్నారు. ఇది కూడా నెగిటివ్‌గా మారింది. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి.
ఉదయం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే 400 పాయింట్లు పైకి వచ్చాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఎఫ్ఎమ్సీజీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది.
అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరే పరిస్థితులు కనిపిస్తుండడం, ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడడం, అంతర్జాతీయంగా సానుకూలాంశాలు మార్కెట్లను ముందుక నడిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి.
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనమవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ ఓ మోస్తరు లాభాల్లో కదలాడుతున్నాయి.
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం వల్ల బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 11న) ఉదయం 6.30 గంటల సమయానికి దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
వెండి రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు వెండి కిలోకు ఏకంగా 9000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ఏకంగా రూ. 2, 07, 000కు చేరుకుంది. అనుకున్నట్టుగానే రెండు లక్షలు దాటేసింది. మరోవైపు బంగారం కూడా మరింత పెరిగింది.
ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. మొదటి రోజున ఐపీఓ ధరతో పోల్చుకుంటే 46 శాతం ప్రీమియంతో లిస్ట్ అయి లాభాలను పంచింది. గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి.
మంగళవారం ఉదయంతో పోల్చుకుంటే బుధవారం ఉదయం బంగారం ధర గ్రాముకు వెయ్యి రూపాయిల మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 10న) ఉదయం 6.30 గంటల సమయానికి దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..