లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:42 PM
దేశీయ సూచీలు ఓ మోస్తరు లాభాలతో రోజును ముగించాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది.
దేశీయ సూచీలు ఓ మోస్తరు లాభాలతో రోజును ముగించాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది. దీంతో సెనెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (83,277)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి దూసుకొచ్చింది. ఆ తర్వాత రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 300 పాయింట్లకు పైగా లాభపడి లాభపడి 83,598 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 83,450 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 42 పాయింట్ల లాభంతో 25,725 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో పేటీఎమ్, డెలివరీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ, ఇండియన్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఎస్‌ఆర్‌ఎఫ్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, బీఎస్‌ఈ లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, నాల్కో మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 224 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 158 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.68గా ఉంది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం