పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సహకరించాలి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:28 PM
పోలింగ్ కేంద్రా ల హేతుబద్ధీకరణకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని డీఆర్వో శ్రీనివాసమూర్తి కోరారు.
డీఆర్వో శ్రీనివాసమూర్తి
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలింగ్ కేంద్రా ల హేతుబద్ధీకరణకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని డీఆర్వో శ్రీనివాసమూర్తి కోరారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నారని తెలిపారు. 1200 కంటే ఎక్కువ ఉన్న చోట అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. రాజాం నియోజకవర్గంలో 17, బొబ్బిలిలో 27, చీపురుపల్లిలో 4, గజపతినగరంలో 3, నెల్లిమర్లలో 4, విజయనగరంలో 61, ఎస్.కోట నియోజకవర్గంలో 10 మొత్తం 126 పోలింగ్ కేంద్రా ల్లో 1200 కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారని వివరించారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, తరలింపు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఎన్ని కల కమిషన్ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.