..to Odisha ఈ ఏడాది అక్టోబరు 10న బొబ్బిలి మండలం పెంట గ్రామం నుంచి రేషన్ బియ్యాన్ని గుట్టుగా తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో అధికారులు వేగావతి నది వంతెన సమీపంలో రైడ్ చేసి పట్టుకున్నారు. సుమారు 15 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు.
interest on police post పాతబగ్గాం గ్రామం ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ప్రభుత్వం తాజాగా చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఆ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఉద్యోగాలు సాధించారు. కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే గ్రామానికి చెందిన 15 మంది పోలీస్ వృత్తిలో స్థిరపడ్డారు.
From now on.. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సన్నద్ధమౌతున్నది. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. దూర ప్రాంతాలకు సైతం బస్సులు నడపడం ద్వారా విజయనగరం, ఎస్.కోట డిపోలకు ఎక్కువ ఆదాయం వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఆన్లైన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రజా సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ అన్నారు.
అమటాం గ్రామానికి చెందిన కోరాడ సూరి(70) విశాఖా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు సీఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపారు.
Visionary Vajpayee దేశ రాజకీయాల్లో మచ్చలేని మహోన్నత వ్యక్తి, దార్శనికుడు, కవి అటల్‌బిహారీ వాజపేయి అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండలంలోని గుణుపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిచెందినట్లు డెంకాడ ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు.
చెరుకుపల్లి జంక్షన్ జాతీయ రహ దారిపై గురువారం రాత్రి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయాలపాలయ్యారు.
మండలంలోని రాజాపులోవ వై జంక్షన్ సమీప జాతీయ రహదారిపై గురువా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడడ్ల రాంబాబు(27) అనే యువకుడు అక్కడకక్కడే మృతిచెందాడు.
Gravel Racket — Is Anyone Stopping It? జిల్లాలో గ్రావెల్, కంకర తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా పోడు, డీపట్టా, కొండపోడు, కొండపోరంబోకు భూములతో పాటు అటవీశాఖ పరిధిలో కొండలకు కొదవలేదు. అయితే అక్రమార్కులు వాటిని అడ్డాగా చేసుకుని తవ్వకాలు చేపడుతున్నారు.