ప్రజా భాగస్వామ్యంతో స్వచ్ఛాంరఽధ సాధ్యం
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:19 AM
ప్రజా భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సాధ్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
బెలగాం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రజా భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సాధ్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన ఆసుపత్రి పరిసరాలను పరిశీ లించారు. పారిశుధ్య సిబ్బందితో మాట్లాడి పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. తడి, పొడి చెత్త డబ్బాలను తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయ చంద్ర మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పారిశుధ్యం కోసం ప్రయత్నాలు సాగుతున్న ప్పటికీ తగిన ఫలితం లేకపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్ర మంలో వైద్యాధికారులు డా.నాగభూషణరావు, డా.శివనాగజ్యోతి, మున్సిపల్ కమిషనర్ పావని, కూటమి నాయకులు పాల్గొన్నారు.