Share News

Poultry Farming పెరటి కోళ్ల పెంపకంపై దృష్టి

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:10 AM

Focus on Backyard Poultry Farming గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే దేశవాళీ పెరటి కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో సంబంఽధిత అధికారులతో సమీక్షించారు.

 Poultry Farming  పెరటి కోళ్ల పెంపకంపై దృష్టి
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి పీవో

  • ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి

పార్వతీపురం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే దేశవాళీ పెరటి కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో సంబంఽధిత అధికారులతో సమీక్షించారు. సాలూరు, పాచిపెంట మండ లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు ఇన్‌చార్జి పీవో చెప్పారు.గిరిజన కుటుంబాల ఆర్థిక పరిపుష్టి, పౌష్టికాహార భద్రతే ధ్యేయంగా హెఫర్‌ ఇంటర్నేషనల్‌ సహకారంతో పెరటి కోళ్ల పెంపకం ప్రాజెక్టు చేపడుతున్నట్లు వెల్లడించారు. గిరిజన మహిళా సంఘాలకు కోళ్ల యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. ఐటీడీఏ, పశు సంవర్థకశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక, పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీవో మురళీధర్‌, జిల్లా పశుసంవర్థకశాఖాధికారి ఎస్‌.మన్మఽథరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:10 AM