పరిశుభ్ర పార్వతీపురమే లక్ష్యం’
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:22 AM
పరిశుభ్ర పార్వతీపురమే లక్ష్యమని జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు.
పార్వతీపురం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్ర పార్వతీపురమే లక్ష్యమని జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి చిన్నారావు, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.