Share News

‘Happy Sunday’ పురపాలక సంఘాల్లో ‘ హ్యాపీ సండే ’

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:11 AM

‘Happy Sunday’ in Municipal Corporations పురపాలక సంఘాల్లో నేటి నుంచి హ్యాపీ సండే కార్యక్రమం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘాల్లో తిరిగి పునరుద్ధరించనున్నారు.

‘Happy Sunday’  పురపాలక సంఘాల్లో ‘ హ్యాపీ సండే ’

సాలూరు రూరల్‌, ఫిబ్రవరి21(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘాల్లో నేటి నుంచి హ్యాపీ సండే కార్యక్రమం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘాల్లో తిరిగి పునరుద్ధరించనున్నారు. ఈ నెల 22న ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మునిసిపాలిటీలు, పాలకొండ, రాజాం, నెలిమర్ల నగర పంచాయతీలు, విజయనగరం నగరపాలక సంస్థల్లో ‘హ్యాపీ సండే’ నిర్వహించనున్నారు. ప్రజల్లో ఆరోగ్యం, ఆనందం పెంపొందించే లక్ష్యంగా ఇకపై ప్రతి నెలా రెండు, నాలుగో ఆదివారాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. యోగా, ధ్యానం, నడక, సైక్లింగ్‌, ఆటలు, కథలు, డ్రాయింగ్‌ పోటీలు, స్వచ్ఛభారత్‌, మొక్కలు నాటడం, సంగీతం, సాహిత్య, కళ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనడానికి ఎటువంటి రుసుం చెల్లించనక్కరలేదు.

Updated Date - Feb 22 , 2026 | 12:11 AM