Share News

YSRCP’s Objective హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యం

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:13 AM

Targeting Hindu Sentiments Is YSRCP’s Objective హిందువులు మనోభావాలను దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తుందని టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి అన్నారు. శనివారం పార్వతీపురం టీడీపీలో కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో కలిసి ఆమె విలేఖర్లతో మాట్లాడారు.

 YSRCP’s Objective  హిందువుల మనోభావాలు  దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యం
విలేఖర్లతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

పార్వతీపురం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): హిందువులు మనోభావాలను దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తుందని టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి అన్నారు. శనివారం పార్వతీపురం టీడీపీలో కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో కలిసి ఆమె విలేఖర్లతో మాట్లాడారు. కాళ్లకు బూట్లు, చెప్పులు వేసుకుని శ్రీవారి ఫొటోలతో శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. వారి ప్రవర్తనను ప్రజలు అసహ్యహించుకుంటున్నారని తెలిపారు. దేవుడి పేరుతో రాజకీయం చేయడం తగదన్నారు. హిందూ మత విశ్వాసాలను కించపరిస్తే ఊరు కునేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నాయకులకు బుద్ధి రావడం లేదన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు తీరు మార్చుకోవాలన్నారు. వారి వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:13 AM