వరుస నష్టాల నుంచి ఉపశమనం.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:06 AM
ఐటీ సెక్టార్‌లో అమ్మకాల కారణంగా గత వారం భారీగా నష్టపోయిన సూచీలు సోమవారం కాస్త కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాటలో సాగుతున్నాయి.
ఐటీ సెక్టార్‌లో అమ్మకాల కారణంగా గత వారం భారీగా నష్టపోయిన సూచీలు సోమవారం కాస్త కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాటలో సాగుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్‌పై మదుపర్లు సానుకూలంగా ఉండడం కూడా కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (82,480)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో 200 పాయింట్లు కిందకు వెళ్లింది. అయితే కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉదయం 11:00 గంటల సమయంలో సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 82,768 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 51 పాయింట్ల లాభంతో 25,522 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్, టొరెంట్ ఫార్మా, కేఫిన్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డిక్సన్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఐనాక్స్ విండ్, బీఎస్‌ఈ లిమిటెడ్, ఎంజెల్ వన్, పీఐ ఇండస్ట్రీస్, ముత్తూట్ ఫైనాన్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 12 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.71గా ఉంది.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాకు ఏపీ సీఎం అభినందనలు..