ఐటీ సెక్టార్‌కు ఏఐ దెబ్బ.. నష్టాల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - Feb 12 , 2026 | 10:35 AM
అమెరికాలో తాజాగా విడుదలైన జాబ్ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ కూడా ప్రతికూలంగా మారింది.
అమెరికాలో తాజాగా విడుదలైన జాబ్ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ కూడా ప్రతికూలంగా మారింది. ఈ రిపోర్ట్‌తో ఐటీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం లాభాలను ఆర్జిస్తోంది (Indian stock market).
గత సెషన్ ముగింపు (84,233)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో 200 పాయింట్లు కిందకు వెళ్లింది. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు. ఐటీ సెక్టర్‌లోని హెవీ వెయిట్ షేర్లు సూచీలను వెనక్కి లాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 323 పాయింట్ల నష్టంతో 83,910 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 89 పాయింట్ల నష్టంతో 25,865 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో జైడూస్ లైఫ్ సైన్సెస్, బయోకాన్, ఫోర్టిస్ హెల్త్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్బీఎల్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కోఫోర్జ్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 368 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 105 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.58గా ఉంది.
ఇవి కూడా చదవండి..
చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..