Share News

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Feb 12 , 2026 | 07:24 AM

ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం చాలా కష్టం. అదీ ఎన్నో లక్షల రూపాయల విలువైన బంగారం పోగొట్టుకుంటే ఇక దాని మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే దుబాయ్ పారిశుధ్య కార్మికుల నిజాయితీ వల్ల ఓ భారతీయ కుటుంబం దాదాపు రూ.12 లక్షలు విలువైన బంగారాన్ని తిరిగి దక్కించుకుంది.

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..
gold recovery in 3 days

ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం చాలా కష్టం. అదీ ఎన్నో లక్షల రూపాయల విలువైన బంగారం పోగొట్టుకుంటే ఇక దాని మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే దుబాయ్ పారిశుధ్య కార్మికుల నిజాయితీ వల్ల ఓ భారతీయ కుటుంబం దాదాపు రూ.12 లక్షలు విలువైన బంగారాన్ని తిరిగి దక్కించుకుంది. పోయిందనుకున్న బంగారాన్ని దుబాయ్ పారిశుధ్య కార్మికులు, పోలీసులు మూడ్రోజుల్లోనే ఆ కుటుంబానికి తిరిగి అందజేశారు (Indian family gold loss).


భారతదేశానికి చెందిన కామిని కన్నన్ అనే మహిళ ఇటీవల ఓ కార్యక్రమం కోసం దుబాయ్‌కి వెళ్లారు. ఆమె దగ్గర 50 గ్రాముల 24 క్యారెట్ల బంగారు కడ్డీ, నాలుగు 22 క్యారెట్ కాయిన్లు ఉన్నాయి. వాటిని ఓ పౌచ్‌లో ఉంచి డైనింగ్ టేబుల్‌పై పెట్టారు. అయితే ఇల్లు క్లీన్ చేస్తున్న సమయంలో ఆమె కొడుకు ఆ పౌచ్‌ను చెత్త బుట్టలో పడేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులు ఆ చెత్తను తీసుకెళ్లిపోయారు (₹13 lakh gold found).


తర్వాతి రోజు చూసేసరికి బంగారం కనిపించలేదు. ఇల్లంతా వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు చెత్త బుట్టలో పడేసినట్టు కామిని కొడుకు అభిమన్యుకు అర్థమైంది. బంగారం పోయిన విషయాన్ని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు (gold recovery in 3 days). మరోవైపు చెత్తను డంపింగ్ యార్డ్‌లో వేస్తున్న సమయంలో ఆ పౌచ్‌ను గుర్తించి, అందులో బంగారం ఉన్నట్టు తెలుసుకున్న పారిశుధ్య కార్మికుడు నిజాయితీగా దానిని తీసుకెళ్లి సంబంధిత అధికారులకు అందజేశాడు.


కాగా, దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు పారిశుధ్య అధికారులను సంప్రదించగా బంగారం దొరికినట్టు తెలిసింది. వెంటనే కామిని కుటుంబానికి ఫోన్ చేసి వారు పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి అప్పగించారు. పారిశుధ్య కార్మికుడి నిజాయితీని అందరూ అభినందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

Updated Date - Feb 12 , 2026 | 10:34 AM