Share News

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:43 AM

జలమండలి పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Telangana Government

హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): జలమండలి పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది. ఈ క్రమంలోనే మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ కొనసాగుతుండగా.. సైబరాబాద్‌కు శ్రీజన, మల్కాజ్‌గిరి వినయ్ కృష్ణారెడ్డిలను రాష్ట్ర సర్కార్ నియమించింది.

కాగా.. ఓఆర్ఆర్ పరిధిలో నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణను జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరా, మురుగు వ్యవస్థలతో పాటు సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధిని కూడా జలమండలి చేపట్టనుంది. నీటి సరఫరా, మురుగు వ్యవస్థలతో పాటు సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధి కూడా చేపట్టనుంది. మల్కాజ్‌గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ, హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, సైబరాబాద్ ఈడీగా ఎం.సంతోష్, లోక్‌భవన్ జాయింట్ సెక్రటరీగా కె.శశి కిరణాచారిలను రాష్ట్ర సర్కార్ నియమించింది.


అలాగే.. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లతో కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసింది. ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్ ప్రాంతాలతో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయగా.. సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్‌లతో జీహెచ్ఎంసీని విభజించింది. ప్రస్తుతం 1450 చదరపు కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరాతో పాటు 650 చ.కి.మీ.ల మేర సివరేజ్ నిర్వహణ చేస్తున్న జలమండలి.. ఇక నుంచి 2,053 చ.కి.మీ. మేర మంచినీటి సరఫరాతో పాటూ సివరేజ్ నిర్వహణ చూడనుంది. కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించేందుకు జలమండలి చర్యలు తీసుకోనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా

Read Latest Telangana News And AP News And Telugu News

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా

Updated Date - Feb 11 , 2026 | 12:22 PM