Home » GHMC
హైదరాబాద్ మహానగరంలో నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీల్లో రోడ్లపై నిలిపి ఉంచిన పాడైన నిరుపయోగ, శిథిల వాహనాలను యజమానులు తొలగించాలని, లేని పక్షంలో తాము తొలగిస్తామని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరించిన నేపధ్యంలో.. అదనపు కమిషనర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధి గణనీయంగా పెరిగిన నేపధ్యంలో పనిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
హైడ్రా.. ఓ పాక్కును కాపాడింది. అయితే.. ఈ స్థలాల విలు రూ. 13 కోట్లు ఉంటుందని అంచనా. శేరిలింగంపల్లి మండలం, మదీనగూడ విలేజ్‌లో పార్కు కోసం స్థలాన్ని కేటాయించగా.. ఓ వ్యక్తి కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. అయితే దీనిపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా.. ఆ స్థలాన్ని కాపాడింది.
జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సస్పెండ్ చేశారు. బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డిని అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడకు ట్రాన్స్ఫర్ చేశారు.
జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేస్తున్న 60 మంది డిప్యూటీ ఇంజినీర్లను బదిలీలు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లుగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 150 వార్డులుండగా.. దానిని ప్రస్తుతం 300 వార్డులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కాగా.. కుత్బుల్లాపూర్ జోన్‌లో అత్యధికంగా ఏడు సర్కిళ్లను ఏర్పాటు చేశారు.
మార్చి 31 వరకు వన్ టైం స్కీ గడువు ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ నగర ప్రజలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. విలీన మునిసిపాల్టీల పరిధిలోనూ మాఫీ వర్తిస్తుందని ఆయన అన్నారు.
జీహెచ్ఎంసీ విస్తరణ, వార్డుల డీలిమిటేషన్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. వార్డుల విభజనపై దాఖలైన 80కి పైగా పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.
వచ్చే మండు వేసవిలో హైదరాబాదీల తాగు నీటి కొరత తీర్చేందుకు వాటర్ బోర్డ్ నాలుగు నెలల ముందే చర్యలు రూపొందిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు..