నాంపల్లి అగ్ని ప్రమాదంపై మంత్రి పొంగులేటి ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:10 PM
నాంపల్లిలో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాపించకుండా పక్క భవనాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, జనవరి24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం(Nampally Fire Accident) సంభవించిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖ ఫర్నిచర్ షోరూమ్‌లో వ్యాపించిన మంటలు స్థానికంగా కలకలం రేపాయి. ఈ ప్రమాదం కారణంగా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అయితే భారీ అగ్నిప్రమాదం ఘటనపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పందించారు.
సహాయక చర్యలు వేగవంతం చేయాలి..
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మంత్రి పొంగులేటి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాపించకుండా పక్క భవనాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్, ఫైర్ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అదనపు ఫైర్ ఇంజిన్స్‌తో మంటలు అదుపులోకి తీసుకురావాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌తో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ మేయర్..

నాంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరుకున్నారు. అక్కడున్న అధికారులను అడిగి ఘటనపై వివరాలు ఆరా తీశారు. ఈ స్థలాన్ని పరిశీలించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
Read Latest Telangana News And Telugu News