Home » Ponguleti Srinivasa Reddy
భూదార్ కార్డులపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు.
వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో శివశంకర్ అవినీతికి పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లని రేవంత్రెడ్డి సర్కార్ నియమించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని కేబినెట్ తీర్మానం చేసింది. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఉండటంతో ఆశావాహులు పోటీ నుంచి వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో ఈ నిర్ణయంపై కేబినెట్ ఇవాళ పునారాలోచన చేసింది. ఈ నేపథ్యంలో మంత్రుల అభిప్రాయం మేరకు ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అయితే ఇప్పటికే తన ఇంటికి పోలీసులు రావడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ మహిళ మంత్రి ఇంటికి పోలీసులను పంపి అవమానించారని ఆమె మండిపడ్డారు.
తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
అటవీ శాఖకు రెవెన్యూ శాఖ ఇచ్చిన భూమి, అలాగే అటవీ శాఖ రెవెన్యూ శాఖకు ఇచ్చిన భూమిపై వివరాలను రెండు శాఖలు కలిసి నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కడితే, రాష్ట్ర విభజన తరువాత పది సంవత్సరాల పాలనలో ఉన్న బీఆర్ఎస్, తెలంగాణలో హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేదే లేకుండా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని సీఎం తెలిపారు.