Share News

అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలేస్తున్నారు..

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:53 PM

రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆఎర్‌ఎస్‌ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారని, అధికారం పోయిననాటి నుంచి ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్‌ పట్ల విషం చిమ్ముతున్నారని ఆయన అన్నారు.

అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలేస్తున్నారు..

- బీఆర్‌ఎస్‌ నాయకులకు ఒంటి నిండా విషమే

- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

- వర్ధన్నపేటలో రూ.294 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వర్ధన్నపేట(వరంగల్): రాష్ట్రంలో బీఆఎర్‌ఎస్‌ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారని, అధికారం పోయిన నాటి నుంచి ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్‌ పట్ల విషం చిమ్ముతున్నారని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) విమర్శించారు. సోమవారం వర్ధన్నపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, మినీ స్టేడియం, ఓపెన్‌ జిమ్‌ సెంటర్‌, సబ్‌ జైలు, మునిసిఫ్‌ కోర్టు, డ్రైనేజీ, సీసీ రోడ్లు సుమారు రూ.294కోట్ల అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు.


అనంతరం పట్టణంలో ఏ ర్పాటు చేసిన పబ్లిక్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజ ల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ఆనాటి ప్ర భుత్వంలో రూపొందిన మంచి పథకాలను కొనసాగిస్తూ ముం దుకు సాగుతున్నామని తెలిపా రు. రాబోయే ఏప్రిల్‌ నెలలో మళ్లీ కొత్త ఇళ్లు మంజూరి చేయడంతో పాటు అవి కాక మరో మూడుసార్లు ఇళ్లు మంజూరీ చే స్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ సత్యశారద, అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యారాణి, మునిసిపల్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు, తహసీల్దార్‌ విజయ్‌ సాగర్‌, ఎంపీడీవో వెంకటరమణ, మాజీ టెస్కాబ్‌ చైర్మన్‌ మార్నేని రవీందర్‌ రావు, డీసీసీ అధ్యక్షుడు అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.


medaram5.2.jpgవర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు కోరిక మేరకు వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.కోటి 30లక్షల నిధులు ఇచ్చానని ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్ర అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ వర్ధన్నపేటలో మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏ ఒక్కరిని ఎదగనీయకుండా దృతరాష్టుని పాలన చేశాడని విమర్శించారు. పాలకుర్తిలో ప్రజలు తరిమికొడితే మళ్లీ వర్ధన్నపేట మునిసిపాలిటీపై అవాకులు, చవాకులు పేలుతున్నాడని దుయ్యబట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి.

చైనా మాంజాకు ఐదేళ్ల బాలిక బలి

హింసను ప్రశ్నించినా బెదిరింపులే!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 27 , 2026 | 12:53 PM