Home » Warangal
వరంగల్ జిల్లా జాఫర్‌ఘడ్‌లో మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇన్నయ్యను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు.
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వీసీ డాక్టర్ నందకుమార్ కొట్టిపారేశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు.
పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడి కిడ్నీ నిండా రాళ్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అయితే.. ఆ బాలుడి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరంగల్ జిల్లాకు చెందిన బాలుడి కిడ్నీలోకి రాళ్లు చేరాయి.
బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్ల డ్రామా ఆడారని సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. బీసీలకు ముఖ్యమంత్రి క్షమాపన చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటూ..
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందే అని హరీష్ డిమాండ్ చేశారు.
పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రైతులు పత్తి తరలించకపోవడంతో ఏనుమాముల మార్కెట్ యార్డు బోసిపోయింది.