Share News

నేను.. జాతరకు దూరంగా ఉండలేదు..

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:17 AM

మేడారం జాతరకు తాను దూరంగా ఉన్నానని జరుగుతున్న ప్రచారాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ తిప్పికొట్టారు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపును ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

నేను.. జాతరకు దూరంగా ఉండలేదు..

  • ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం

  • ఈసారి పెరగనున్న హుండీ ఆదాయం

  • దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హనుమకొండ: మేడారం జాతరకు తాను దూరంగా ఉన్నానని జరుగుతున్న ప్రచారాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ(Konda Surekha) తిప్పికొట్టారు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపును ప్రారంభించిన అనంతరం మీ డియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి జాతరకు రాకుండా ఎలా ఉంటాన్నారు. పను ల ఒత్తిడి వల్ల ఒకటీ రెండు సార్లు మాత్రమే రాలేద ని చెప్పారు. తాను ఎప్పుడూ ఇద్దరు తల్లులు గద్దెపైకి వచ్చిన తర్వాతే వస్తానన్నారు. దీనిని ఆసరా చేసుకొని కొందరు రాలేదన్న ప్రచారం చేశారని అన్నారు.


ఎవరు కూడా అమ్మవార్ల దగ్గర రాజకీయం చేయరన్నారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇంత కష్టపడి గద్దెలను కట్టిన తర్వాత మేం రాజకీయం ఎందుకు చేసుకుంటామన్నారు. అందరం కలిసి కట్టుగా పని చేశామన్నారు. కనుకనే గద్దెల నిర్మాణం జరిగిందన్నారు. ఎక్కడ, ఏ చిన్న అభిప్రాయ భేదం, చర్చ జరగలేదన్నారు. ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మాణం చేసినప్పుడు ప్రతిపక్షాలు సానుకూలంగా మాట్లాడాలని, కానీ విమర్శించడమనేది వారి విజ్ఞతకే వది లేస్తున్నానన్నారు.


పెరగనున్న హుండీ ఆదాయం

ఈసారి మేడారం జాతర ఆదాయం పెరిగే అవకాశం ఉందని మంత్రి సురేఖ తెలిపారు. జాతరకు గతంలో కన్నా కోటిమంది ఎక్కువగా వచ్చారని, దీనితో ఆదాయం కూడా పెరగవచ్చునన్నారు. వాస్తవంగా 50లక్షల మంది అదనంగా వస్తారని అంచనా వేశామని, తల్లుల గద్దెలను సుందరీకరించడం వల్ల అనుకున్నదానికన్నా ఎక్కువ మంది భక్తులు వచ్చారన్నారు. భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో సహజంగానే జాతరలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. కోట్లాది మంది భక్తులు ఉప్పెనలా వచ్చినప్పుడు ఇలాంటివి జరగడం సహజమని, ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేయాలని ప్రయత్నించారన్నారు.


konda.jpgఅయినా కూడా జాత ర ప్రశాంతంగా జరిగిందని మంత్రి చెప్పారు. తల్లుల గద్దెల వద్ద కొన్ని రాళ్లు ఊడి చెదిరిపోయాయని, వాటిని త్వరలోనే పునర్మించి, ఇక ముందు అలా జరగకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటాన్నామన్నారు. భక్తులు ఎప్పుడైనా వచ్చి తల్లులను దర్శనం చేసుకునేలా, వారు అక్కడ బస చేసేలా మరిన్ని ఏర్పాట్లు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. సీఎం ఆలోచన మేరకు గద్దెల పనులను పునఃప్రారంభిస్తామని తెలిపారు. హుండీల సంఖ్య పెరిగినందువల్ల లెక్కింపునకు ఎక్కువ రోజులు పట్టవచ్చునన్నారు. జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎన్‌ఆర్‌ఐలు పెద్ద సంఖ్యలో వచ్చారని, దీనితో హుండీల్లో పెద్దమొత్తం విదేశీ కరెన్సీ కూడా కానుకల రూపంలో పడ్డాయని మంత్రి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి.

సినిమాలు తక్కువ.. గాసిప్స్‌ ఎక్కువ

భాస్కరా అవార్డులాగా కేసీఆర్‌కు జాతిపితనా..!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2026 | 11:26 AM