తల్లికి పిండప్రదానం చేస్తూ..
ABN , Publish Date - Feb 10 , 2026 | 10:25 AM
హనుమకొండ కేయూ పోలీసుస్టేషన్ పరిధి గుండ్లసింగారం సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో న్యాయవాది రాజిడి వెంకటరాజా నర్సింహారెడ్డి (48) సోమవారం గల్లంతయ్యారు.
అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలో పడిన న్యాయవాది
పోలీసుల గాలింపు.. దొరకని ఆచూకీ..
హనుమకొండ: హనుమకొండ కేయూ పోలీసుస్టేషన్ పరిధి గుండ్లసింగారం సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో న్యాయవాది రాజిడి వెంకటరాజా నర్సింహారెడ్డి (48) సోమవారం గల్లంతయ్యారు. కేయూ సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. హనుమకొండ కుమార్‌పల్లికి చెందిన అడ్వకేట్ రాజిడి వెంకటరాజా నర్సింహారెడ్డి సోమవారం ఉదయం తన తల్లి పదో వర్ధంతి సందర్భంగా ఎస్సారెస్పీ కెనాల్ వద్ద కు వెళ్లారు. అక్కడ పిండప్రదానం చేస్తున్న క్రమంలో అదుపుతప్పి కెనాల్‌లో పడి కొట్టుకుపోయారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఎస్‌డీఆర్‌ఎఫ్, నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు బృందాలుగా ఏర్పడి నర్సింహారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కెనాల్‌లో ఉధృతంగా నీరు ప్రవహించడంతో నర్సింహారెడ్డి ఆచూకీ తెలియడం లేదని సీఐ రవికుమార్ తెలిపారు. నర్సింహారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News