ఆధార్ సేవల విస్తరణకు చర్యలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:18 AM
మన్యంలో ఆధార్ సేవలను మరింతగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు.
ఐటీడీఏ పీవో శ్రీపూజ
ఐటీడీఏ కార్యాలయంలో ఆధార్ నమోదు సెంటర్ ప్రారంభం
పాడేరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆధార్ సేవలను మరింతగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఏజెన్సీలో ఆధార్ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 150 మొబైల్ ఆధార్ కిట్‌లను సమకూర్చామన్నారు. వాటి ద్వారా అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలకు అవసరమైన ఆధార్ సేవలను అందిస్తామన్నారు. భవిష్యత్తులో ఆధార్ కార్డులు లేని పౌరులుండకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రజలు తమ ఆధార్ కార్డుల నమోదు, మార్పులు, చేర్పులు వంటి ప్రక్రియల కోసం ఆధార్ నమోదు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, పరిపాలనాధికారి ఎం.హేమలత, పీఎంవో ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్ రాంగోపాల్, అడిషనల్ పీఐవో రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.