Share News

బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 10 , 2026 | 06:35 AM

ఇటీవల రికార్డు గరిష్ఠాలను తాకిన బంగారం, వెండి.. రెండు, మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం ఈ రెండు లోహాల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 10న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price

ఇటీవల రికార్డు గరిష్ఠాలను తాకిన బంగారం, వెండి.. రెండు, మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం ఈ రెండు లోహాల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ప్రస్తుతం ఈ రెండు లోహాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం బంగారం, వెండి స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి (Gold prices).


ఈ రోజు (ఫిబ్రవరి 10న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,57,920కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,760కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,58,070కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,44,910కి చేరుకుంది.


మరోవైపు ఇటీవల భారీగా పతనమైన వెండి కూడా స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం కిలోకు వంద రూపాయల మేర పెరుగుదల నమోదు చేసింది. మళ్లీ మూడు లక్షల రూపాయల మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 1,57,920, రూ. 1,44,760

  • విజయవాడలో రూ. 1,57,920, రూ. 1,44,760

  • ఢిల్లీలో రూ. 1,58,070, రూ. 144,910

  • ముంబైలో రూ. 1,57,920, రూ. 1,44,760

  • వడోదరలో రూ. 1,57,970, రూ. 1,44,810

  • కోల్‌కతాలో రూ. 1,57,920, రూ. 1,44,760

  • చెన్నైలో రూ. 1,57,920, రూ. 1,44,760

  • బెంగళూరులో రూ. 1,57,920, రూ. 1,44,760

  • కేరళలో రూ. 1,57,920, రూ. 1,44,760

  • పుణెలో రూ. 1,57,920, రూ. 1,44,760


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 3,00,100

  • విజయవాడలో రూ. 3,00,100

  • ఢిల్లీలో రూ. 3,00,100

  • చెన్నైలో రూ. 3,00,100

  • కోల్‌కతాలో రూ. 3,00,100

  • కేరళలో రూ. 3,00,100

  • ముంబైలో రూ. 3,00,100

  • బెంగళూరులో రూ. 3,00,100

  • వడోదరలో రూ. 3,00,100

  • అహ్మదాబాద్‌లో రూ. 3,00,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


Also Read:

ఖర్చుకు వెనకాడని యూఎస్ కంపెనీలు! హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రెండు కొత్త వాల్యూ-బేస్డ్ ఫండ్స్

Updated Date - Feb 10 , 2026 | 07:06 AM