తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తం..
ABN , Publish Date - Feb 16 , 2026 | 10:26 AM
తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో టెన్షన్ నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా, ఫిబ్రవరి 16: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 ఓట్లు ఉంటాయి. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 10 ఓట్లు. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్‌కు 9 వార్డులు, కాంగ్రెస్‌కు 7 వార్డులు దక్కాయి. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.
బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ జనసమీకరణ వ్యూహం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక సమయంలో రెండు పార్టీల శ్రేణుల మధ్య ఉద్రిక్తత తీవ్రమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..
బుల్లెట్ రైళ్ల హబ్‌గా శంషాబాద్!
Read Latest Telangana News And Telugu News