హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:43 PM
మునిసిపల్ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల ఎత్తులు ప్రదర్శిస్తున్నారు. మైకులు, కళాకారుల ఆట పాటలతో ప్రచారాన్నిహోరెత్తిస్తున్నారు.
ఇక మిగిలింది నాలుగు రోజులే..
వార్డుల్లో నాయకుల సందడే..సందడి
పరకాల(వరంగల్): మునిసిపల్ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల ఎత్తులు ప్రదర్శిస్తున్నారు. మైకులు, కళాకారుల ఆట పాటలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ(Congress, BRS, BJP) నుంచి ముఖ్య నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి స్థానికంగా ఉంటూ ప్రచారం చేస్తున్నారు.
కొందరు స్వతంత్య్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతీ మునిసిపాలిటీ గెలుచుకోవాల్సిందే అని ఎమ్మెల్యేలకు, నాయకులకు దిశానిర్దేశం చేయడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పట్టణంలో పట్టు నిలుపుకుంటే కేడర్‌లో జోష్ పెరుగడం వల్ల కేడర్‌ను కాపాడుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సులభం అవు తుందని బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారానికి పదును పెంచుతున్నారు.
కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు బల నిరూపణకు పోటీ పడి ప్రజలను ప్రచారానికి తీసుకెళ్తున్నారు. ప్రచారానికి వెళ్తే ఒక్కొక్కరు రూ. 200 నుంచి 500 వరకు ముట్టచెబుతున్నారు. మరికొన్నిచోట్ల రూ. 200 ఇవ్వడంతో పాటు చికెన్, బిర్యాని కూడా పంపిణీ చేస్తున్నారు. కార్నర్ మీటింగులకు ఓటర్లను తరలించే కొందరు నాయకులకు వారి గ్రూప్ సంఖ్యను బట్టి రూ5000 నుంచి రూ20000వరకు ముట్టచెబుతున్నారు.
ప్రత్యర్థి పార్టీల్లో నాయకులకు డబ్బు, మద్యం ఎరగా వేసి ఎన్నికల్లో గెలుపుకోసం మార్గాలు తయారు చేసు కుంటున్నారు. కోవర్టులను ఏర్పాట్లు చేసుకుని వారి ఎత్తులను చిత్తు చేయడానికి అభ్యర్థులు డబ్బులు ఆశ చూపుతున్నారని సమాచారం. ప్రత్యర్థి అభ్యర్థితో ఉండే ముఖ్యమైన నాయకులు పార్టీ మారకున్నా సమాచారం చేరవేసి వారి ఓటమికి కృషి చేసే వారికి రూ. 50000 నుంచి రూ.లక్ష వరకు ముట్ట చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఓటర్లనే కాకుండా ప్రత్యర్థి పార్టీల నాయకులను కూడా ప్రలోభాలకు గురి చేసి పార్టీలు మారడానికి వ్యూహాలు రచిస్తున్నారని తెలిసింది. ఏదిఏమైనా ఎన్నికల ప్రచారం ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండ డంతో పార్టీలు ఎన్ని ఎత్తులు వేస్తాయో, ఎవరు ఎటు జంప్ అవు తారో ఓటర్ల మనసు ఎలా ఉం టుందో వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్.. పులి.. వరంగల్ జిల్లా కుందారంలో పాదముద్రల గుర్తింపు
జగన్ గుంటూరు టూర్.. పలువురు వైసీపీ నేతలపై కేసులు
Read Latest Telangana News and National News