జగన్ గుంటూరు టూర్.. పలువురు వైసీపీ నేతలపై కేసులు
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:54 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో ర్యాలీలు నిర్వహించడంతో పలువురు పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30ను అతిక్రమించారని, ర్యాలీల కారణంగా గుంటూరులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
గుంటూరు, ఫిబ్రవరి 06: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన సందర్భంగా పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30ను ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించారని ఆరోపిస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నల్లపాడులో బలసాని కిరణ్ కుమార్, పోతిన మహేశ్‌పై కేసు నమోదు చేశారు. అలాగే తాడేపల్లిలో దొంతిరెడ్డి వేమారెడ్డి, మంగళగిరిలో నూనె ఉమామహేశ్వర్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. నగరంపాలెం ప్రాంతంలో నూరి ఫాతిమా, పానుగంటి చైతన్యపై కేసులు నమోదు కాగా.. గుంటూరు పట్టాభిపురంలో అంబటి మురళిపైనా కేసు నమోదైంది.
జగన్ పర్యటన సందర్భంగా నిర్వహించిన ర్యాలీల కారణంగా.. గుంటూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, పోలీస్ నిబంధనలను అతిక్రమించడం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు
Read Latest AP News And Telugu News