Share News

వేడుక ఏదైనా.. ఒకేలా జగన్ అభిమానుల హంగామా..

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:41 AM

పరామర్శ అయినా, పెళ్లి వేడుక అయినా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు ఒకేలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎక్కడికెళ్లినా రచ్చ రచ్చ చేస్తున్నారు.

వేడుక ఏదైనా.. ఒకేలా జగన్ అభిమానుల హంగామా..

  • పరామర్శ అయినా, పెళ్లి వేడుకైనా ఒకేలా జగన్‌ అభిమానుల హంగామా

  • మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు కుమారుడి వివాహానికి మాజీ సీఎం

  • పెళ్లి వేడుకలోనూ సీఎం జగన్‌ అంటూ నినాదాలు

(భీమవరం-ఆంధ్రజ్యోతి)

పరామర్శ అయినా, పెళ్లి వేడుక అయినా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు ఒకేలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎక్కడికెళ్లినా రచ్చ రచ్చ చేస్తున్నారు. గురువారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెద అమిరంలో శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు కుమారుడి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్‌ ఉదయం 11.15 సమయంలో హాజరయ్యారు. ఇది తెలిసి ఆయన అభిమానులు అక్కడ గుమిగూడారు. జగన్‌ కళ్యాణ వేదిక వద్దకు వెళ్లిన సమయంలో వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన స్టీల్‌ బారికేడ్లను నెట్టేసి కల్యాణ మండపంలోకి దూసుకెళ్లారు. పులివెందుల పులి, సీఎం జగన్‌ అంటూ కల్యాణం మండపంలో జగన్‌ ఉన్నంత సేపూ పెద్దపెట్టున నినదిస్తూనే ఉన్నారు. హెలీప్యాడ్‌ వద్ద కార్యకర్తల హడావుడి లేకపోయినా, కల్యాణ వేడుక ప్రాంగణంలో మాత్రం కార్యకర్తలు హంగామా చేశారు.

Updated Date - Feb 06 , 2026 | 10:01 AM