Share News

ఏపీలో ఎన్‌హెచ్‌ నెట్‌వర్క్ అభివృద్ధికి నిరంతర నిధులు.. గడ్కరీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం

ABN , Publish Date - Feb 06 , 2026 | 09:36 AM

ఏపీలో ఎన్‌హెచ్ నెట్‌వర్క్ అభివృద్ధికి నిరంతరం నిధుల కేటాయింపులు జరపడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్ కనెక్టివిటీపై కేంద్రం ఫోకస్‌ పెట్టడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

ఏపీలో ఎన్‌హెచ్‌ నెట్‌వర్క్ అభివృద్ధికి నిరంతర నిధులు.. గడ్కరీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం
Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 6: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి(Union Minister Nitin Gadkari) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల(NH) నెట్‌వర్క్ అభివృద్ధికి కేంద్రం నిరంతరం నిధులు కేటాయించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ను కేంద్ర మంత్రి గడ్కరీకి ట్యాగ్ చేశారాయన.


ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టులతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులకు కనెక్టివిటీపై కేంద్రం దృష్టి సారించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. హింటర్‌ల్యాండ్ నుంచి పోర్టుకు సులభమైన లింకేజీ ఏర్పడటం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు.


ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ.. మచిలీపట్నం పోర్టుకు NH-65, NH-216 జంక్షన్ నుంచి 6-లేన్ రోడ్డు నిర్మాణానికి రూ.573.77 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటిస్తూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫ్రైట్ టర్న్‌అరౌండ్ టైమ్ సహా ట్రాఫిక్ కంజెస్టన్ తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది.


ఇవి కూడా చదవండి...

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

ఎక్కడికెళ్లినా అదే రచ్చ

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 06 , 2026 | 10:18 AM