Home » Guntur
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానం దక్కించుకోవడంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు.
గుంటూరు జిల్లాలోని పొన్నూరు మున్సిపాలిటీలో ఈరోజు మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్టీఆర్ కాలం నుంచి బీసీలకు అండగా ఉన్నామని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక 28వ సారి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు
సీఎం చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్ చేసి యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్న ఆర్‌ఎన్ ఎడిటర్ య్యూ టూబ్ చానల్‌పై గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పనికి వెళ్లిన మేనమామ, మేనల్లుడు అనంత లోకాలకు చేరారు.
వైసీపీ నేతలపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాప్ కార్యాలయం వద్ద వైసీపీ పెద్దలు రణరంగం చేశారని విమర్శించారు.
రాజధాని అమరావతిలో రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. తుళ్లూరు, అనంతవరం పరిధిలో ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్, ఏపీసీఆర్‌డీఏ మధ్య అవగాహన ఒప్పందం (MoU) పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో రూ.11,085 కోట్లతో చేపట్టనున్న ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తీవ్ర వాయుగుండం కారణంగా దెబ్బతిన్న రహదారులను త్వరలోనే పునరుద్ధరిస్తామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,405 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 412 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించారు.