Share News

ఆంధ్రా వీరప్పన్‌కు అల్జీమర్స్‌ సోకినట్లుంది

ABN , Publish Date - Feb 13 , 2026 | 01:03 PM

ఆంధ్రా వీరప్పన్‌గా పేరుగాంచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అల్జీమర్స్‌ వ్యాధి సోకినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.

ఆంధ్రా వీరప్పన్‌కు అల్జీమర్స్‌ సోకినట్లుంది

  • కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు: ఆంధ్రా వీరప్పన్‌గా పేరుగాంచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అల్జీమర్స్‌ వ్యాధి సోకినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు(Kanaparthy Srinivas Rao) ఎద్దేవా చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయడం తానెన్నడూ చూడలేదని పెద్దిరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపైనా, ఎన్టీఆర్‌ భవన్‌పైనా దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది వైసీపీ గూండాలు కాదా అని ప్రశ్నించారు.


zzzzzzzzzzz.jfifరాష్ట్రంలో దాడుల సంస్కృతికి శ్రీకారం చుట్టింది జగన్‌ రెడ్డేనని మండిపడ్డారు. జగన్‌ ప్రాపకం కోసం అంబటి ఎప్పుడెప్పుడు అరెస్టవుదామా అని తహతహలాడిపోయారన్నారు. అంబటి కుమార్తె కూడా ఆయనలా అబద్ధాలను అవలీలగా వల్లే వేస్తోందని విమర్శించారు. అంబటికి కుటుంబసభ్యులు బూతులు మాట్లాడకుండా హితబోధ చేయాలని, లేకుంటే ఈసారి బడితె పూజ తప్పదని కనపర్తి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు

నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2026 | 01:03 PM