Home » TDP
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని శుక్రవారం టీడీపీ నాయకులు నిర్వహించారు.
విశాఖలో డీప్ టెక్ సదస్సు.. ఈ కార్య క్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీని నాలెడ్జ్ హబ్గా మారుస్తామని, 2014-19 మధ్య ఏపీ గ్రోత్ రేట్ 13 శాతమని.. ఇప్పుడు 15 శాతం టార్గెట్గా పనిచేస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం: నగరంలోని నోవాటెల్ హోటల్లో జరగనున్న ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఆయన ముంబై నుంచి గురువారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
పరిశ్రమలలో భద్రతపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమను మరో మంత్రి సవితతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. కియలో కార్మికుల భద్రత గురించి ఆరా తీశారు.
ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. యువతకు ఏఐలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంతో పాటు ఈ రంగంలో అధునాతన సాంకేతిక ఆవిష్కరణలకు సంపూర్ణ సహకారం అందించేలా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ గూగుల్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
టీడీపీ సభ్యత్వ నమోదులో హిందూపురం పార్లమెంట్ నియో జకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మె ల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. వెంకటాపు రంలో బుఽఽధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసు కున్నారు. జోన-5 పరిధిలో 3. 80 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేయించి రికార్డు సృష్టించారన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన ఆరో తేదీన నోవాటెల్లో జరిగే ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’లో పాల్గొంటారు. దీనిని గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ నిర్వహిస్తోంది. దీనికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.