Share News

AP News: ‘స్వార్థంతోనే వైసీపీ దుష్ప్రచారం..’

ABN , Publish Date - Dec 31 , 2025 | 09:12 PM

జిల్లాల పునర్విభజనపై వైసీసీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం విశ్వసించరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..

AP News: ‘స్వార్థంతోనే వైసీపీ దుష్ప్రచారం..’
TDP leader Kalava Srinivasulu

అమరావతి, డిసెంబర్ 31: జిల్లాల పునర్విభజనపై వైసీసీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం విశ్వసించరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లాల పునర్విభజనపై వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఖండించారు. జగన్ స్వార్థపూరితంగా చేసిన జిల్లాల ఏర్పాటును కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల ఆధారంగా సరి చేసిందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని జిల్లాల పునర్విభజన జరిగిందన్నారు. అన్నమయ్య జిల్లాపై వైసీపీ నేతలు అనవసరం రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.


అన్నమయ్య పేరును ఎక్కడా తొలగించలేదని క్లారిటీ ఇచ్చారు శ్రీనివాసులు. జిల్లా కేంద్రం మాత్రమే మదనపల్లెకు మార్చామన్నారు. రాజంపేట, రైల్వే కోడూరు ప్రజల ఆకాంక్ష మేరకు ఆయా ప్రాంతాలను వేరే జిల్లాల్లో కలిపామని తెలిపారాయన. రాయచోటి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీనివాసులు గుర్తు చేశారు. 28 జిల్లాల పునర్విభజనలో రాజకీయాలు లేవని, ప్రజల మద్దతు పూర్తిగా ఉందన్నారు. వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి పొందేందుకే కుట్రలు, కుతంతాలు చేస్తున్నారని విమర్శించారాయన. కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు ముఖ్యం కాదని.. ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు.


Also Read:

Revanth Reddy: ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..

Funny wedding moment: వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..

Divide Ancient Artifacts: ఏపీ,తెలంగాణ మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ

Updated Date - Dec 31 , 2025 | 09:12 PM