Divide Ancient Artifacts: ఏపీ,తెలంగాణ మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ
ABN , Publish Date - Dec 31 , 2025 | 07:21 PM
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ ఏర్పాటు అయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉంచిన పురాతన వస్తువుల విభజన కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ ఏర్పాటు అయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉంచిన పురాతన వస్తువుల విభజన కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వస్తువుల పంపకం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్ పర్సన్‌గా రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ ఛైర్ పర్సన్ తేజస్వీ పొడపాటి నియామకం జరిగింది.
కన్వీనర్‌గా పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. కమిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చరిత్ర విభాగ విశ్రాంత హెచ్ వోడీ ప్రొఫెసర్ వకులా భరణం రామకృష్ణతో పాటు పురావస్తు శాఖ, మ్యూజియంలో ఉన్నత హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు అధికారులు ఉన్నారు. పురాతన వస్తువుల విభజన కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీలతో కొత్తగా ఏర్పాటైన కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రానికి చెందిన పురాతన వస్తువులను గుర్తించి, ఎంపిక, పర్యవేక్షణ, పంపిణీకి ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది.
పురాతన వస్తువులను రాష్ట్రానికి బదిలీ చేయడం సహా మ్యూజియంలో భద్ర పరిచే చర్యలు తీసుకోనుంది. ఇందుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని పురావస్తు , మ్యూజియంల కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే డయాబెటిస్ రిస్క్ ..!
ప్రళయ్ మిసైళ్ల ప్రయోగం విజయవంతం