DRDO: ప్రళయ్ మిసైళ్ల ప్రయోగం విజయవంతం
ABN , Publish Date - Dec 31 , 2025 | 06:46 PM
ఆపరేషనల్ కండిషన్ల కింద యూజర్ ఎవల్యూషన్ ట్రయిల్స్‌లో భాగంగా ప్రళయ్ క్షిపణులను ప్రయోగించినట్టు డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు క్షిపణలు నిర్దేశిత మార్గంలో వెళ్లి లక్ష్యాలను చేరుకున్నట్టు పేర్కొంది.
చాందీపూర్: అత్యాధునిక టెక్నాలజీతో డీఆర్‌డీఓ రూపొందించిన రెండు ప్రళయ్ క్షిపణుల (Pralay missiles) టెస్ట్-ఫైర్ విజయవంతమైనట్టు రక్షణ శాఖ బుధవారంనాడు తెలిపింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 10.30 గంటలకు ఈ మిసైళ్లను ప్రయోగించారు. ఒకే లాంఛర్ నుంచి వరుసగా వీటిని ప్రయోగించినట్టు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఈ క్షిపణని అభివృద్ధి చేసింది.
ఆపరేషనల్ కండిషన్ల కింద యూజర్ ఎవల్యూషన్ ట్రయిల్స్‌లో భాగంగా ప్రళయ్ క్షిపణులను ప్రయోగించినట్టు డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు క్షిపణలు నిర్దేశిత మార్గంలో వెళ్లి లక్ష్యాలను చేరుకున్నట్టు పేర్కొంది. మిసైల్ ఫ్లైట్ తుది దశ వెరిఫికేషన్ కూడా విజయవంతమైందని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి