Terror Plot Foiled: భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం
ABN , Publish Date - Dec 31 , 2025 | 02:48 PM
టోంకోలో ఓ మారుతీ కారులో తరలిస్తున్న 150 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఎంతో తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యూరియా బస్తాల్లో అమ్మోనియం నైట్రేట్‌ను తరలించడానికి ప్రయత్నించారు.
రాజస్థాన్‌లో ఉగ్రవాదులు భారీ ఉగ్రకుట్రకు పన్నాగం పన్నారు. పెద్ద స్థాయిలో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారు. అయితే, పోలీసులు అప్రమత్తం అవ్వటంతో ఉగ్రకుట్ర భగ్నం అయింది. టోంకోలో ఓ మారుతీ కారులో తరలిస్తున్న 150 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఎంతో తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యూరియా బస్తాల్లో అమ్మోనియం నైట్రేట్‌ను తరలించడానికి ప్రయత్నించారు.
అమ్మోనియం నైట్రేట్‌తో పాటు 200 దాకా ఎక్స్‌ప్లోజివ్ బ్యాటరీలు, 1100 మీటర్ల పొడువైన వైర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిని సురేంద్ర, సురేంద్ర మోచీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోజన నిధులు!
ఆలయం ముందు ముళ్ళపొదల్లో.. ఆడశిశువు