Home » terror attack
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన టెర్రిరిస్ట్ డాక్టర్ ముజమిల్ షకీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉమర్ గురించి పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.
గత అక్టోబర్‌లో నౌగామ్‌లోని బన్‌పోరలో పోలీసులు, భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ పోస్టర్లు వెలిసాయి. దీనిపై శ్రీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులందరూ హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న వారిగా తేలింది. ఉగ్ర మూలాలు బయటపడ్డంతో దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున యూనివర్సిటీపై దృష్టి సారించాయి. కాలేజీ మూతపడే అవకాశం ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది.
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఆపరేటీవ్‌తో ఆ ముగ్గురూ భేటీ అయినట్లు తేలింది.
ఎర్రకోట పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాఫ్తు సంస్థ తాజాగా మరో కీలక అంశాన్ని వెల్లడించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్-ఉన్-నబి ఎర్రకోట పార్కింగ్ లాట్‌లో ఉంచిన కారులోనే బాంబును తయారు చేసినట్టు షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిద్ధిఖీని ఈడీ అరెస్ట్ చేసింది. మంగళవారం అరెస్ట్ చేసిన సిద్ధిఖీని ఈ రోజు సాకేత్ కోర్టులో ఈడీ హాజరు పరిచింది.
ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేల్చడానికి వారం రోజుల ముందు నబీ కశ్మీర్‌లోని పుల్వామాలో తన ఇంటికి వెళ్లి సోదరుడు జహూర్ ఇలాహాకి ఆ వీడియో ఉన్న మొబైల్ ఫోన్ ఇచ్చాడు. నబీ స్నేహితులు అరెస్ట్ అయిన తర్వాత అతడి సోదరుడు ఆ ఫోన్‌ను ఓ చెరువులోకి విసిరేశాడు
నవంబర్ 10వ తేదీన ఉమర్ నబీ అనే వ్యక్తి ఎర్రకోట దగ్గర ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 13 మంది చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
గత సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఐ-20 కారు నుంచి విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. ఈ కేసు విచారిస్తున్న అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు
ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బాంబ్ బ్లాస్ట్ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సంఘటనా స్థలం దగ్గర తాజాగా మూడు 9 ఎమ్ఎమ్ కాట్రిడ్జ్‌లు దొరికాయి. వాటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్‌లు కాగా.. మరొకటి ఖాళీ షెల్. బాంబు పేలిన చోటులోకి ఈ మూడు కాట్రిడ్జ్‌లు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.