Share News

పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని భారీ బాంబ్ బ్లాస్ట్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jan 14 , 2026 | 03:54 PM

పాకిస్థాన్‌లోని నార్త్ వెస్టర్న్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీస్ వ్యాన్‌ని టార్గెట్ చేసుకొని జరిపిన బాంబ్ బ్లాస్ట్ లో ఏడుగురు మృతి చెందారు. దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని భారీ బాంబ్ బ్లాస్ట్.. వీడియో వైరల్
Pakistan Bomb Blast News

పాకిస్థాన్‌: నార్త్ వెస్టర్న్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) సంస్థ దాడులకు తెగబడింది. టీటీపీ జరిపిన దాడుల్లో ఏడుగురు సాయుధ పోలీసులు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో స్థానిక పోలీస్ చీఫ్ ఇషాక్ అహ్మద్ ఉన్నట్లు సమాచారం. టాంక్ జిల్లాలోని గోమల్ మార్కెట్ వద్ద పోలీసులు ప్రయాణిస్తున్న కారును టీటీపీ రిమోట్ కంట్రోల్‌తో పేల్చినట్లు సమాచారం. పేలుడు దృశ్యాలకు సంబంధించిన ఫుటేజ్‌ని బుధవారం ఆ సంస్థ రిలీజ్ చేసింది.


ఈ వీడియోలో పేలుడు తర్వాత దట్టమైన నల్లటి పొగ వెలువడుతోంది. వాహనం గాల్లోకి ఎగిరి తునాతునకలైపోయింది. పేలుడు ప్రభావం చాలా బీభత్సంగా ఉండటం వల్ల రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. ఉగ్రవాదులు గాయపడిన పోలీసు సిబ్బందిపైనా కాల్పులు జరిపి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దోచుకువెళ్లారు. ఈ ఘటన పెట్రోలింగ్ విధుల్లో ఉన్నప్పుడు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)తో టార్గెట్ చేసి పేల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిని పాకిస్థాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు.


ఇవి కూడా చదవండి..

మదురై కాదు.. చెన్నైకి మోదీ

పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 14 , 2026 | 05:23 PM