Share News

PM Modi Celebrates Pongal: పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:28 AM

ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi Celebrates Pongal: పొంగల్‌  వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi

ఢిల్లీ, జనవరి 18: పొంగల్‌ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రధాని మోదీ(PM Narendra Modi Pongal)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా తొలుత ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధాని నిర్వహించారు. అనంతరం ఆయనే స్వయంగా పొంగల్‌ వండారు.


ఈ సందర్భంగా ప్రధాని మోదీ గోవులకు పూజ చేశారు. పొంగల్ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. మరోవైపు ఈ పొంగల్ వేడుకను పలువురు ప్రముఖులు ఘనంగా జరుపుకుంటున్నారు. అలానే దేశ వ్యాప్తంగా ప్రజలు వివిధ రకాల వంటకాలు చేసుకుని, ఇళ్లను అలకరించుకుని పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!

Updated Date - Jan 14 , 2026 | 11:54 AM