Share News

TG News: బసవన్నలే నేస్తాలు.. బతుకంతా కష్టాలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:19 AM

గతంలో గంగిరెద్దుల ఆటలకు గ్రామాల్లో ఆదరణ ఉండేది. అయితే.. మారిన పరిస్థితుల నేపథ్యంలో... గ్రామాల్లో గంగిరెద్దుల ఆటలకు ఆదరణ కరువైపోచింది. ప్రస్తుతం ఎక్కడో ఒకచోట ఈ గంగిరెద్దుల వారు దర్శనమిస్తున్నారు. ప్రధానంగా సంక్రాంతి సమయాల్లో గంగిరెద్దుల విన్యాసాలు కనబడేవి.

TG News: బసవన్నలే నేస్తాలు.. బతుకంతా కష్టాలు

- గంగిరెద్దుల ఆటకు ఆదరణ కరువు

జనగామ: ‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారి కి దండం పెట్టు.. వాళ్ల గొడ్డూ గోదా.. పిల్ల జెల్లా చల్లంగా ఉండాలని దీవించు..’ అం టూ సంక్రాంతి వేళ ఇళ్ల ముంగిళ్లలోకి వచ్చే డూడూ బసవన్నల ఆశీర్వచనాలు కనుమరుగవుతు న్నాయి. ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే గొబ్బెమ్మలు.. రంగు రంగుల ముగ్గుల మధ్య గంగిరెద్దుల విన్యాసాలు పల్లెలకు కొత్త కళ తెచ్చేవి. మారుతున్న కాలంతో పాటు గంగిరెద్దుల సంస్కృృతి పూర్తిగా అంతరించిపోతున్నది. గంగిరెద్దుల కళకు ఆదరణ లేకపోవడంతో ఆ కళనే నమ్ముకున్నవారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. గత్యంతరంలేక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు.


దీంతో నేటితరం పిల్లలకు గంగిరెద్దు అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పెరిగిన సాంకేతికతతో పండుగలు కళ తప్పుతు న్నాయి. సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చే గంగిరె ద్దుల విన్యాసాలు కనుమరుగయ్యాయి. ఏళ్లకేళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. గంగిరెద్దుల ను ఆడించే వారిని పట్టించుకు నే వారు లేక.. ఆ సంచార జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయి. తాత.. ముత్తాతల నుంచి వస్తున్న ఆచారాలను వదు లుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


gangi.jpg

జనగామ జిల్లా ఖిలాషాపూర్‌లో నివాసముంటున్న బత్తుల శ్రీను, ఆవుదొడ్డి మహేష్‌, ఆవుదొడ్డి రాజు చెబుతున్నారు. గంగి రెద్దుల ఆట కోసం పది నెలల నుంచి నాలుగేళ్ల వయస్సు వరకు ఉన్న ఎద్దులను కొనుగోలు చేసి వాటికి నిత్యం పచ్చగడ్డి వేస్తూ ఆకు పసర్లతో తాము చెప్పే మాటలను వినే విధంగా తర్పిదునిస్తున్నారు. గుంటూరు, నవాబుపేట, కోదా డ, ఒంగోలు నుంచి రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు వెచ్చించి ఎద్దులను కొనుగోలు చేసి మూడు నెలల పాటు వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆటకు సిద్ధం చేస్తామని బత్తుల శ్రీను తెలిపారు.


ఆకట్టుకునేలా అలంకరణ

ఆటకు వెళ్లే ముందు బసవన్నలను అందంగా అలంకరిస్తారు. రంగురంగుల జాకె ట్టు ముక్కలు, చీరలతో బొంతను తయారు చేసివాటిపై కప్పుతారు. ఈత చెట్టు కమ్మలతో చాపలు అల్లి వాటిని రంగులతో అందంగా తీర్చిదిద్ది కొమ్ములకు తొడుగు తారు. మెడకు గజ్జెల పట్టి, కాళ్లకు గజ్జెలు కడతారు. ఒక్కో గంగిరెద్దును అలంకరించేం దుకు సుమారు రూ.15 వేల వరకు ఖర్చు వస్తుందట. బసవన్నలకు శిక్షణ ఇచ్చేటప్పు డు వాటికి ‘అలడగం’ కూడా నేర్పిస్తామని,


ఆటలు ఆడే సమయాల్లో ఎక్కువ డబ్బుల కోసం అలిగేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని శ్రీను తెలిపారు. గంగిరెద్దు మనిషి ఛాతిపై ఆడడం, గంగిరెద్దు నోట్లో మెడ పెట్టడం, మోకాళ్లపై కూర్చుని నడవడం వంటి ఆటలను కుడా నేర్పిస్తామని చెప్పారు. ఎవరైనా చనిపోతే సమాచారం తెలుసుకుని గంగిరెద్దు విన్యా సాలు చేసి చూపిస్తు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటామని తెలిపారు. సంచార జీవితాన్ని అనుభవిస్తున్న తమ కు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు చూపాలని గంగిరెద్దుల కళాకారులు కోరుతున్నారు.


తాతల నుంచి ఇదే పని

నా చిన్నప్పటి నుంచి గంగిరెద్దులను ఆడిస్తూనే బతుకుతున్న.. మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తి ఆచారంగా వత్తాంది. సావు.. బతుకులే మాకు బుక్కెడు బువ్వ కల్పిస్తయి.. సంక్రాంతి పండుగప్పుడే మా చేతిలో చాలా పైసలు కనిపిస్తయి. పొట్ట కూటి కోసం గంగిరెద్దుతో ఊరూరు తిరుగుతున్నం..

- బత్తుల శ్రీను, ఖిలాషాపూర్‌


కళను బతికించేందుకు పుట్టెడు కష్టాలు పడుతున్నాం..

గంగిరెద్దులను ఆడించే కళను బతికించడానికి పుట్టెడు కష్టాలు పడుతున్నాం. గంగిరెద్దులతో సంచార జీవనం సాగిస్తు పొట్ట పొసుకుంటున్నాం. ఉండటానికి ఇల్లు.. తినడానికి తిండి.. కట్టుకోవడానికి బట్ట కూడా కరువైంది. ప్రభుత్వం మాకు ఆర్థిక సాయం అందించి అదుకోవాలి.

- ఆవుదొడ్డి మహేష్‌, ఖిలాషాపూర్‌


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2026 | 11:42 AM