Home » Sankranthi festival
హైదరాబాద్ మహా నగరంలో ప్రతీ చెరువును పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పతంగుల పండుగ నాటికి చెరువులను సిద్ధం చేయాలన్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని జనవరి 13 నుంచి పతంగుల పండుగను నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దూరప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లే నగర ప్రయాణికులకు దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో ప్రత్యేకంగా హాల్టింగ్ ఏర్పాటు చేసింది.
‘నేను మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పోస్టు పెట్టిన యువకుడు అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని నరసాపురం(Narasapuram) మండలం, కేశవంపేట్‌కు చెందిన చింతల పవన్ మణికంఠ(19) కేపీహెచ్‌బీ కాలనీ(KPHB Colony)లో హాస్టల్ ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు.
ఊరెళ్లి వచ్చేసరికి ఇంట్లోఉన్న బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. పేట్‌బషీరాబాద్(Petbashirabad) పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బౌద్దనగర్ పక్కనే ఉన్న విజయహోమ్స్‌లో 10 నంబరు విల్లాలో ఉంటున్న శ్యామల ఉదయ్‌సాయి ప్రసన్న సంక్రాంతి(Sankranti)కి ఈ నెల 12వ తేదీన ఖమ్మం(Khammam) వెళ్లింది.
పెరంబలూరు జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమత్తువ పొంగల్(Pongal) వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ(Collector's Office) ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో పొంగుళ్లు పెట్టారు. అనంతరం నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
కనుమ సందర్భంగా బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 170గ్రామాల్లో ప్రభల తీర్థాలను కన్నుల పండువగా నిర్వహించారు.
పండగ పందేలు జాతరను తలపించాయి. ఎక్కడికక్కడ షామియానాలు, కుర్చీలు, ఎల్‌ఈడీ స్ర్కీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, వీటికి కామెంట్రీలు ఏర్పాటు చేసి స్టేడియం తరహాలో బరులను నిర్వహించారు.